- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏషియన్ ఫుట్‌బాల్ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
దిశ, స్పోర్ట్స్ : ఖతార్‌లో జరుగుతున్న ఏషియన్ ఫుట్‌బాల్ కప్‌ను భారత్ ఓటమితో మొదలుపెట్టింది. గ్రూపు-బిలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 2-0తో పరాజయం పాలైంది. జాక్సన్ అలెగ్జాండర్ ఇర్విన్, జోర్డన్ జాకబ్ బాస్ చెరో గోల్ చేసి ఆసిస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. అయితే, మొదట్లో భారత్ డిఫెండర్లు చక్కటి ప్రదర్శన కనిపించారు. ఆసిస్ దాడులను తిప్పకొట్టారు. అయితే, భారత్ పలు తప్పిదాలతో గోల్ చేసే అవకాశాలను చేజార్చుకుంది. దీంతో ఫస్టాఫ్ 0-0తో ముగిసింది. అయితే, సెకండాఫ్‌లో ఆసిస్ బలంగా పుంజుకుంది. అలెగ్జాండర్ ఇర్విన్ 50 నిమిషంలో, జాకబ్ బాస్ 73వ నిమిషంలో గోల్ చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. చివరి వరకూ టీమ్ ఇండియా గోల్ చేయడంలో విఫలమై ఓటమిని అంగీకరించింది. కాగా, ఈ నెల 18న ఉజ్బెకిస్తాన్‌తో భారత్ రెండో గ్రూపు మ్యాచ్ ఆడనుంది. భారత్ నాకౌట్‌కు చేరుకోవాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
Read More..
- Tags
- #afc asian cup