Cricket: టీ20లో ప్రపంచ రికార్డు బద్దలు.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో 39 పరుగులు

by Mahesh |   ( Updated:2024-08-20 06:43:55.0  )
Cricket: టీ20లో ప్రపంచ రికార్డు బద్దలు.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో 39 పరుగులు
X

దిశ, వెబ్ డెస్క్: ఒకే ఓవర్లో 39 పరుగులు చేయడంతో ప్రపంచ టీ20 రికార్డులు బద్దలయ్యాయి. ఐసీసీ మెన్స్ టీ20 ఈస్ట్ ఆసియా పసిఫిక్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఈ సరికొత్త రికార్డు నమోదైంది. వనాటు జట్టుపై సమోవా జట్టు ప్లేయర్ విస్సర్ 6 బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. అలాగే మరో మూడు నో బాల్స్ వేయడంతో ఏకంగా ఒకే ఓవర్లో 39 పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచులో విస్సర్ 62 బంతుల్లో ఏకంగా 14 సిక్సర్లు బాది 132 పరుగులు చేశాడు. దీంతో టీ20లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా కూడా విస్సర్ చరిత్ర ను తిరగ రాశాడు. గతంలో విస్సర్ కంటే ముందు, యువరాజ్ సింగ్, పోలార్డ్, పూరన్, దీపేంద్ర, రోహిత్ శర్మ, రింకు సింగ్.. ఓకే ఓవర్లు 36 పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed