చెస్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌కు చేరుకున్న 17 ఏళ్ల ప్రగ్నానంద

by Mahesh |   ( Updated:2023-08-18 11:29:54.0  )
చెస్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌కు చేరుకున్న 17 ఏళ్ల ప్రగ్నానంద
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రగ్నానంద చెస్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌కు చేరుకుని రికార్డు సృష్టించాడు. గురువారం రాత్రి బాకులో జరిగిన FIDE వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్‌ అర్జున్ ఎరిగైసిని 5-4తో ఓడించి చెస్ ప్రపంచ కప్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించాడు. దీంతో FIDE వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న విశ్వనాథన్ ఆనంద్ తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్ R ప్రజ్ఞానంద మొదటి భారతీయుడిగా రికార్డుకెక్కాడు.

దీంతో ప్రగ్నానంద సెమీఫైనల్స్‌లో అమెరికాకు చెందిన స్ ఫాబియానో కరువానాతో పోటిపడనున్నాడు. అలాగే.. వచ్చే ఏడాది చివర్లో జరిగే ముఖ్యమైన ఈవెంట్ లో కూడా దాదాపు చోటు దక్కించుకున్నాడు. క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో వాస్తవంగా స్థానం సంపాదించడం ద్వారా, చెన్నైకి చెందిన టీనేజ్ చెస్ స్టార్ ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ కాకుండా అభ్యర్థులలో పాల్గొన్న ఏకైక భారతీయుడిగా నిలిచాడు.

Advertisement

Next Story