ఆడపిల్లల రక్షణకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

by srinivas |   ( Updated:2020-08-25 10:34:05.0  )
ఆడపిల్లల రక్షణకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి ఆధునిక సమాజంలో ఆడపిల్లలపై ఎక్కడో చోట అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అలాంటి నేరాలకు పాల్పడిన వారిని అరెస్టు చేసినా వారికి శిక్ష పడటంతో చాలా సమయం పడుతోంది. ఇకమీదట అలాంటి ఘటనలను నిరోధించడానికి ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది.

ఈ నేపథ్యంలోనే ఆడపిల్లల రక్షణకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 8 స్పెషల్‌ కోర్టులను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాల కేసులు (పోక్సో) విచారణ కోసం ఈ ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.

వందకు పైగా పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్న చోట్ల ఈ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప , అనంతపురం, పశ్చిమ గోదావరి, భీమవరం, తెనాలి, మచిలీపట్నంలలో వీటిని ఏర్పాటు చేయనుంది. జిల్లా జడ్జి క్యాడర్‌తో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు కానున్నాయి. ఇదిలాఉండగా, మహిళ సంరక్షణ కోసం జగన్ సర్కార్‌ ఇప్పటికే దిశ చట్టాన్ని తీసుకొచ్చింది.

Advertisement

Next Story