- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శన అదే.. గంగూలీ సీరియస్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్ : బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ప్రదర్శనపై సీరియస్ కామెంట్స్ చేశాడు. గత నాలుగైదేళ్లలో టీమిండియా అత్యంత పేలవ ప్రదర్శన అదే అని పేర్కొన్నాడు. ఓ కార్యక్రమంలో జరిగిన చర్చలో భాగంగా గంగూలీ.. టీమిండియా ప్రదర్శనపై ఇలా అన్నారు.
2021 టీ20 ప్రపంచకప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా.. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై కనీస పోరాటం చేయలేదు. గత నాలుగైదేళ్లుగా నేను చూసిన ప్రదర్శనల్లో ఇదే అత్యంత పేలవ ప్రదర్శన అని అన్నారు. ఈ ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారని భావిస్తున్నా. కారణం ఏంటో తెలియదు. ఇలా ఎందుకు జరిగిందని కొన్నిసార్లు కారణాలను వేలెత్తి చూపలేరు అంటూ దాదా కామెంట్స్ చేశాడు.
అలాగే.. నాలుగేళ్ల నుంచి భారత జట్టు చాలా బాగా ఆడుతోంది. 2017, 2019 ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా పోరాడింది. 2017 ఛాంపియన్స్ టోఫ్రీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. అలానే వన్డే ప్రపంచకప్‌లోనూ సెమీస్ వరకు చాలా బాగా ఆడాం. అనుకోని పరిస్థితుల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయామని గంగూలీ అన్నాడు.