మెగాస్టార్ సినిమాలో సోనాక్షి…?

by Shyam |
chiranjeevi sonakshi sinha
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సూపర్‌హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ ఆశించిన ఫలితాన్ని అందించేకపోయింది. ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ఉన్నారు.

ఈ సినిమా తరువాత మలయాళం సినిమా ‘లూసిఫర్’ రిమేక్, ఆ తువాత తమిళ సినిమా ‘వేదాళం’ రిమేక్‌లు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు దర్శకుడు బాబీ చిరు కోసం ఓ కథను రెడీ చేస్తున్నారు. ఆ సినిమాలో మెగాస్టార్‌కి జోడిగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా నటించనున్నట్లు తెలుస్తొంది. ఈ సినిమాకు సంబంధించి సోనాక్షితో డైరెక్టర్ బాబీ సంప్రదించినట్లు సమాచారం. చూడాలి మరి.. బాస్ సరసన బాలీవుడ్ భామ ఫిక్స్ అవుతోందో లేదో…

Advertisement

Next Story