దారుణం: తల్లిదండ్రులపై కొడుకు దాడి

by srinivas |
దారుణం: తల్లిదండ్రులపై కొడుకు దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రులపై కన్న కొడుకే దాడి చేశాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగాయలంక మండలం ఎదురుమొండిలో వీరరాఘవయ్య అనే వ్యక్తి తన తల్లిదండ్రులపై గొడ్డలి, కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి వీరలంకమ్మ మృతి చెందగా.. తండ్రి నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. తన భార్యతో గొడవల కారణంగానే వీర రాఘవయ్య తల్లిదండ్రులపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed