భవిష్యత్తును భయపెట్టిన ‘కాళేశ్వరం’.. కుప్పకూలిన సైడ్ వాల్

by Anukaran |
భవిష్యత్తును భయపెట్టిన ‘కాళేశ్వరం’.. కుప్పకూలిన సైడ్ వాల్
X

దిశ, మంథని: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని భాగమైన పార్వతి బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యత లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొద్దినెలల క్రితం పంప్‌హౌస్ నుంచి నీటి తరలింపునకు వేసిన పైపులైన్ల మీద మట్టి కొట్టుకు పోయి పైకి తేలిపోయాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ నీటి వేగాన్ని తట్టుకోలేక ప్రాజెక్టు సైడ్ వాల్ మంగళవారం కొద్దిగా కూలిపోయింది. ప్రాజెక్టు 74వ గేటు పక్క నుంచి నిర్మించిన సైడ్ వాళ్ళు 5 మీటర్ల మేర ఒక భాగం కూలిపోయి మట్టి బయటపడింది. నిర్మించిన కొన్నాళ్ళకే ఇలాంటి పరిస్థితి ఉంటే భవిష్యత్తులో ప్రాజెక్ట్ నాణ్యత ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో సైతం పలుమార్లు నిర్మాణ లోపాలు బయటపడ్డప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ప్రాజెక్టుకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో చూపిన వేగాన్ని నాణ్యత పాటించడంలో సదరు కంపెనీ చూపకపోవడం వలనే ఇలాంటి పరిణామాలు తలెత్తుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై బ్యారేజ్ అధికారులను సంప్రదించగా ఎవరు స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed