- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్ఐ రాసలీలలు.. తుపాకీ గురిపెట్టి మరీ బాలికపై అఘాయిత్యం
దిశ, వెబ్‌డెస్క్: అతనొక పోలీస్ అధికారి.. ప్రజలు తప్పు చేస్తే శిక్షించాల్సింది పోయి అతడే తప్పులు చేస్తూ జైలుపాలయ్యాడు. ఎందరికో ఆదర్శంగా నిలవాల్సింది పోయి.. కామ కోరికల కోసం ఆరాటపడి కటకటాలపాలయ్యాడు. 17 ఏళ్ల బాలికను తుపాకీ చూపించి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు ఓ ఎస్ఐ. ఈ అఘాయిత్యానికి బాలిక తల్లి, పెద్దమ్మ సహకరించడం గమనార్హం. ఈ దారుణ ఘటన చెన్నై లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..
చెన్నై కాశిమేడు పోలీసు స్టేషన్‌లో స్పెషల్ టీం ఎస్‌ఐ గా సతీష్‌కుమార్ పనిచేస్తున్నాడు. అతను ఇటీవల మాధవరంలో భద్రత విధులు నిర్వహించాడు. ఈ నేపథ్యంలోనే ఆ ఏరియాలో ఉంటున్న రేషన్ దుకాణం మహిళలతో పరిచయం పెంచుకున్నాడు. నిత్యం ఏదో ఒక సాకుతో రేషన్ షాపుకు వెళ్లడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే అతడి కన్ను రేషన్ దుకాణంలో పనిచేసే మహిళా సిబ్బంది కూతురు(17) పై పడింది. ఆమెను ఎలాగైనా లొంగతీసుకోవాలనుకున్నాడు. ఈ విషయంలో బాలిక తల్లి, పెద్దమ్మ కూడా అతడికి మద్దత్తుగా నిలిచారు. దీంతో భయపడిన బాలిక తన తండ్రికి విషయాన్ని తెలియజేసింది.
Read More: కూతుర్ని హత్య చేయడం నా బాధ్యత..ఓ తల్లి వింత వాదన
అసమర్థుడైన తండ్రి ఏమి చేయలేని పరిస్థితి కావడంతో అతడు మిన్నకుండిపోయాడు. ఇక ఇదే అదునుగా భావించిన ఎస్ఐ సతీష్‌కుమార్ తాను చెప్పినట్టు వినకుంటే తండ్రి, తమ్ముడిని కేసుల్లో ఇరికించి జైలుకు తరలిస్తానని బెదిరించాడు. అయినా బాలిక చిక్కలేదు. దాంతో ఎస్ఐ బాలికకు తుపాకీ గురిపెట్టి ఆమెను లైంగికంగా వేధించాడు. ఎస్ఐ ఆగడాలు తట్టుకోలేని బాలిక వాట్సాప్ ద్వారా పుళల్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు ఆమె తల్లి, పెద్దమ్మను గురువారం పోలీసులు అరెస్ట్ చేయగా.. పక్కా ఆధారాలతో శుక్రవారం ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.