ఆటోలో ప్రయాణించిన హీరోయిన్.. నెట్టింట వైరలవుతున్న వీడియో

by Shyam |
ఆటోలో ప్రయాణించిన హీరోయిన్.. నెట్టింట వైరలవుతున్న వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఓ సాధారణ అమ్మాయిలా శ్రద్ధా కపూర్ ఆటోలో ప్రయాణించింది. ఆటో జర్నీకి సంబంధించిన వీడియోను తన ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఖరీదైన కార్లు ఉన్నా సాధారణ అమ్మాయిలా ఆటోలో ప్రయాణం చేసిన ఈ సాహో బ్యూటీపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అబ్బా.. మేం కూడా అదే ఆటోలో ఉంటే బాగుండు అంటూ మరికొంతమంది రీట్వీట్ చేస్తున్నారు. ఓ సీరియల్ ఆధారంగా తెరకెక్కనున్న మూవీలో శ్రద్ధా నటిస్తున్నట్లు టాక్.

Advertisement

Next Story