- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షాకింగ్.. రావణ దహనం పేరుతో అంబేద్కర్ ప్రతిమ కాల్చే యత్నం..
దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విజయదశమి రోజున రావణ దహనం పేరుతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ప్రతిమను కాల్చడానికి గ్రామ సర్పంచ్‌తో పాటు మరికొంతమంది గ్రామ పెద్దలు, కొందరు మతోన్మాదులు కుట్రలు పన్నారని బహుజన సంఘాలు, దళిత సైన్యం నాయకులు ఆరోపిస్తున్నారు.
అంబేద్కర్ ప్రతిమను కాల్చడాన్ని అడ్డుకున్న దళితులను కులం పేరుతో దూషిస్తూ కర్రలతో దాడి చేశారని వారు ఆరోపించారు.
అంతే కాకుండా బూతులు తిడుతూ రాళ్లతో దాడి చేయడం అత్యంత బాధాకరమని వారు అన్నారు. ఈ తతంగమంతా గ్రామ ప్రథమ పౌరుడు అయిన ఆ గ్రామ సర్పంచ్ వడ్ల బాలరాజు ఆధ్వర్యంలోనే జరగడం శోచనీయమన్నారు. భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడిన సర్పంచ్ ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన పెద్ద పోతంగల్ గ్రామ సర్పంచ్ వడ్ల బాలరాజును వెంటనే పదవి నుండి తొలగించాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌ను కోరారు.
అలాగే, అంబేద్కర్ ప్రతిమను కాల్చడానికి ప్రయత్నించిన 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా పోలీసు అధికారులను కోరారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా దళిత సంఘాలు, దళిత సైన్యం రాష్ట్ర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.