తెలంగాణ ప్రభుత్వానికి షాక్..

by Shyam |
తెలంగాణ ప్రభుత్వానికి షాక్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : హపీజ్‌పేటలోని సర్వే నెంబరు 80లో ఉన్న వివాదాస్పద భూములపై హైకోర్టు మంగళవారం స్పష్టత ఇచ్చింది. ఈ సర్వే నెంబరు పరిధిలో ఉన్న 140 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుదో లేక ప్రభుత్వానిదో కాదని, ప్రైవేటు వ్యక్తులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సర్వే నెంబరులోని వివాదాస్పద భూములపై గత కొంతకాలంగా హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం స్పష్టత రావడం విశేషం.

ఇంతకాలం ప్రభుత్వ భూమి, వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి అంటూ ఎటూ తేలకుండా కాలయాపన జరిగినందున పిటిషనర్లకు నాలుగు లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని ఈ రెండు పార్టీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వే నెంబరులోని మొత్తం 140 ఎకరాల భూమిలో 50 ఎకరాలను ప్రవీణ్‌రావు, సహ యజమానుల పేరిట నమోదు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.

హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ భూములపై సుదీర్ఘకాలంగా ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు మధ్య వాదనలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రవీణ్ రావు కిడ్నాప్ వ్యవహారం కూడా భూముల చుట్టే తిరిగింది. ప్రవీణ్ రావును అఖిల ప్రియ, మరికొద్దిమంది కలిసి కిడ్నాప్ చేశారంటూ కేసు నమోదు కావడం, వారిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యవహారంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ఆ భూమి ప్రైవేటు వ్యక్తులదేనని వెల్లడైంది.

Advertisement

Next Story

Most Viewed