- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనియా ఇంటి ఎదుట ధర్నాకు దిగుతా : సుఖ్‌బిర్ బాదల్
దిశ, వెబ్ డెస్క్: పంజాబ్‌లోని తరన్ తరన్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 121కి పెరిగింది. దీనిపై తాజాగా శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు సుఖ్‌బిర్ సింగ్ బాదల్ స్పందించారు. కల్తీ మద్యాన్ని అరికట్టడంలో పంజాబ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అయితే, కల్తీ మద్యం ఉత్పత్తి, సరఫరాలో కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉందని బాదల్ ఆరోపించడమే కాకుండా.. అందుకు నిరసగా ఈ నెల 11న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి ఎదుట ధర్నా చేస్తానని వెల్లడించారు. అంతేకాకుండా, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలాఉండగా, పంజాబ్‌లోని తరన్ తరన్‌లో కల్తీ మద్యం సృష్టించిన విషాదంలో మృతుల సంఖ్య 121కి చేరింది. బాధిత కుటుంబాలను సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పరామర్శించారు. దీని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాగే బాధిత కుటుంబాలకు నష్ట పరిహారాన్ని గతంలో ప్రకటించిన రూ.2 లక్షలకు బదులుగా రూ.5 లక్షలకు పెంచారు. ఈ కేసులో సమగ్రంగా విచారణ జరపాలని డీజీపీ దినకర్ గుప్తాను సీఎం ఆదేశించారు.