- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చేది మన ప్రభుత్వమే.. షర్మిల కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో నిరుద్యోగులెవరూ అధైర్య పడొద్దని వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో మంగళవారం వరంగల్ జిల్లాకు చెందిన యువకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చేది మన ప్రభుత్వమేనని, అందరికీ అండగా నిలుస్తానన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబ్బు లేదని చదువులు మధ్యలోనే ఆపేసే అవకాశం ఉండదని వ్యాఖ్యానించారు.
అందరికీ ఉచిత విద్య అందే రోజు ఎంతో దూరంలో లేదని, తన తండ్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అందరికీ వర్తింపజేస్తామన్నారు. ప్రస్తుత పాలకులు మెరిట్ కటాఫ్ పెట్టి పేద విద్యార్థులకు చదువు దూరం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఒకే కుటుంబానికి ఐదు ఉద్యోగాలు, రాష్ట్రంలో ఒకే ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఉన్నది కేసీఆర్ కుటుంబానికి మాత్రమేనని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తాను అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని షర్మిల హామీ ఇచ్చారు.
గతంలో వైఎస్సార్ ఒకేసారి 58 వేల డీఎస్సీ పోస్టులను భర్తీ చేశారన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్సార్‌కు దక్కిందని గుర్తుచేశారు. అనంతరం షర్మిల అభిమానులు రూపొందించిన సంకల్ప సభను విజయవంతం చేయాలనే నేపథ్యంలో ఉన్న ఆడియోను షర్మిల ఆవిష్కరించారు.
ఇదిలా ఉండగా షర్మిల అనుచరుడు సయ్యద్ ముజ్తాబా అహ్మద్ ఆధ్వర్యంలో పలువురు ముస్లిం యువకులు షర్మిలను కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. రాజన్న రాజ్యం షర్మిల వల్లే సాధ్యమన్నారు.