స్వల్ప నష్టాల్లో మార్కెట్లు!

by Harish |
స్వల్ప నష్టాల్లో మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మార్కెట్లు రాత్రికి రాత్రి బౌన్స్ కావడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. మంగళవారం నాటి భారీ నష్టాలను అదుపుచేస్తూ స్వల్ప నష్టాలతో సూచీలు కదులుతున్నాయి. ఉదయం ప్రారంభంలో కొంతసేపు ఊగిసలాడినప్పటికీ కాసేపటికి స్వల్ప నష్టాల్లోకి మారాయి. 10.30 సమయంలో సెన్సెక్స్ 243.61 పాయింట్ల నష్టంతో 30,335 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 47.70 పాయింట్లను కోల్పోయి 8,919 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీలో ఫార్మా, మెటల్, ఐటీ రంగాలు రెండు శాతానికిపైగా సానుకూలంగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, టైటాన్, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, హీరో మోటోకార్ప్, మారుతీ సుజుకీ అధిక నష్టాలతో కొనసాగుతున్నాయి. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి రూ. 73.96 వద్ద కొనసాగుతోంది.

Tags: sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed