మూసీ నిర్వాసితుల కోసం.. అన్ని వసతులతో కూడిన రెసిడెన్షియల్ టవర్స్ నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

by Mahesh |
మూసీ నిర్వాసితుల కోసం.. అన్ని వసతులతో కూడిన రెసిడెన్షియల్ టవర్స్ నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి(Deputy CM Bhatti) విక్రమార్క మూసీ( Musi ) నిర్వాసితులకు పునరావాసం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైటెక్ సిటీ(Hi-Tech City) లో నిర్వహించిన ఓ ప్రాపర్టీ షోకు భట్టి (Deputy CM Bhatti) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మూసీ సుందరీకరణ కోసం పనిచేస్తుందని,, ఇందులో భాగంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే మూసీ(musi) నిర్వాసితుల కోసం నదికి సమీపంలోనే రెసిడెన్షియల్ టవర్స్ (Residential Towers) నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వమే నిర్మించ ఈ రెసిడెన్షియల్ టవర్స‌లో అన్ని సౌకర్యాలు ఉంటాయని ఆ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అలాగే మూసీ నది నిర్వాసితులకు పాఠశాలలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, చిన్న తరహా వ్యాపార అవకాశలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బందులు పెడుతొందని, ఉన్న ఇంటిని లాక్కొని.. వేరే వద్ద ఇళ్లు ఇస్తామనడం ఎంతవరకు సాధ్యమని మూసీ బాధితులతో కలిసి ప్రతిపక్ష పార్టీలు(Opposition parties) ప్రశ్నిస్తున్నాయి. కాగా ఈ రోజు భట్టి విక్రమార్క మూసీ బాధితులపై చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

Next Story