Auto overturned :అదుపుతప్పి ఆటో బోల్తా...తప్పిన పెను ప్రమాదం

by Sridhar Babu |
Auto overturned :అదుపుతప్పి ఆటో బోల్తా...తప్పిన పెను ప్రమాదం
X

దిశ, శంకర్పట్నం : ఆటో అదుపుతప్పి బోల్తా (Auto overturned)పడడంతో నలుగురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే మానకొండూరు మండలం గట్టు దుద్దెనపల్లి (Gattu Duddenapally)ఎస్సారెస్పీ ప్రధాన కాలువ వద్ద కరీంనగర్ నుంచి కేశవపట్నం వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో డ్రైవర్ తో సహా నలుగురికి గాయాలు అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

గాయపడిన వారిలో తాడికల్ గ్రామానికి చెందిన గడ్డి కుమారస్వామి, చింతగుట్ట గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాజా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 కు సమాచారం అందించడంతో ఈఎంటీ సతీష్ రెడ్డి, పైలట్ ఖాజా ఖలీల్ ఉల్లా క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Next Story