TTD:తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు

by Jakkula Mamatha |   ( Updated:2024-10-27 12:22:17.0  )
TTD:తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి(Tirumala Srivenkateswara Swamy)ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల(Tirumala)లో అక్టోబరు 31న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ(TTD) రద్దు చేసింది. దీపావళి(Diwali) ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు(VIP Break Sightings) రద్దు చేయాలని టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, దీపావళి రోజున సిఫార్సు లేఖల పై వీఐపీ(VIP) బ్రేక్ దర్శనాలు అనుమతించరు. అయితే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఉంటుంది. దీనిపై టీటీడీ స్పందిస్తూ, అక్టోబర్ 30న సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed