- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Eluru: 200 మందికి బురిడీ.. అమెరికా యాప్ ఘరానా మోసం
దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల(Dwarka Tirumala) మండలంలో 200 మందిని అమెరికా యాప్(America App) బురిడీ కొట్టించింది. ఏఎస్ఓ యాప్(ASO app) ద్వారా సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) డబ్బులు కొట్టించారు. తమ యాప్ ద్వారా పెట్టుబడి పెడితే తక్కువ రోజుల్లోనే అధిక మొత్తంలో చెల్లిస్తామని ప్రచారం చేశారు. దీంతో గ్రామీణ ప్రాంత జనాలు విభాగాల వారీగా రూ.6 వేలు, రూ. 18వేలు, 20 వేలు పెట్టుబడి పెట్టారు. ప్రతి విభాగంలో 500 మంది నుంచి 600 మంది దాకా సభ్యులుగా చేరారు. టాస్క్ పూర్తి చేసిన వారి ఖాతాల్లో రూ. 750 డిపాజిట్ చేశారు. దీంతో యాప్‌పై నమ్మకం కలిగించారు. అలా రెండు మూడు సార్లు డబ్బులు జమ చేశారు. ఆ తర్వాత డబ్బులు బ్యాంకులో డిపాజిట్ కాకపోవడంతో మోసపోయినట్లు బాధితులు తెలుసుకున్నారు. ద్వారకా తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాప్ మోసం తెలియక తామంతా డబ్బులు కట్టామని, తమకు న్యాయం చేయాలని కోరారు.