విరాట్- అనుష్క శర్మ విడాకులు తీసుకుంటున్నారా..? దుమారం రేపుతున్న కోహ్లీ సంచలన పోస్ట్.. ఆందోళనలో ఫ్యాన్స్

by Kavitha |   ( Updated:2024-11-21 09:21:02.0  )
విరాట్- అనుష్క శర్మ విడాకులు తీసుకుంటున్నారా..? దుమారం రేపుతున్న కోహ్లీ సంచలన పోస్ట్.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు వామిక, అకాయ్ అనే ఒక పాప, బాబు కూడా ఉన్నారు. కానీ వీరి ఫేస్‌లు మాత్రం ఇంకా రివీల్ చేయలేరు. దీంతో ఎప్పుడెప్పుడు పాప, బాబుల ఫేస్ చూపిస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో విరుష్క జంట పలు పోస్టులతో అభిమానులకు దగ్గరవుతూ ఉంటారు. ఈ క్రమంలో విరాట్ పెట్టిన పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది.

తాజాగా విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో ‘ వెనక్కి తిరిగి చూసుకుంటే మేం ఎప్పుడూ కాస్త భిన్నంగానే ఉంటాం. మేం ఒక అభిరుచికి మాత్రమే పరిమితం కాలేదు. ఆరంభంలోనే మేమేంటో అందరికీ తెలిసినా.. రెండుసార్లు మిస్‌ఫిట్ అయ్యాం. అయితే నేను విమర్శలను, ప్రశంసలను రెండింటిని పట్టించుకోను. ప్రస్తుతం నేను ఎవరో తెలుసుకునే పనిలో చాలా బిజీగా ఉన్నాను. గడిచిన 10 సంవత్సరాల నా కెరీర్‌లో ఎప్పుడూ కూడా అపజయాలు నన్ను కదించలేదు. అలాగే విజయాలు వచ్చినప్పుడు పొంగిపోలేదు. 10 సంవత్సరాల కిందట సరైనది అని అనిపించిన విషయం ఇప్పుడు సరైనది కావొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి అన్నీ చూసుకుంటూ వెళ్లిపోవాలి’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఉన్న పలంగా కోహ్లీ ఈ పోస్ట్ పెట్టడంతో.. విరుష్క అభిమానులు అనుష్కకు విడాకులు ఇవ్వబోతున్నాడా అంటూ ఆందోళన చెందుతున్నారు.





Advertisement

Next Story

Most Viewed