- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజమైన అర్థాంగి.. భర్తకు ప్రాణం పంచిన భార్య
దిశ, వెబ్ డెస్క్: అర్థాంగి.. అనే పదానికి నిజమైన అర్థం చెప్పిన భార్య ఆమె. పెళ్లినాడు చేసిన ప్రమాణాలను, వేసిన ఏడడుగులను గాలికొదిలేసి.. చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో.. తన భర్త ప్రాణానికి తన ప్రాణం అడ్డేసింది ఆ ఇల్లాలు. అతనితో జీవితాన్ని పంచుకోవడమే కాదు.. జీవితాన్ని నిలబెట్టుకుంది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన ధరావత్ శ్రీనుకు జూలూరుపాడుకు చెందిన లావణ్యతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. శ్రీను ఏపీజీవీబీలో ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీను కాలేయం పాడయింది. ఖమ్మంలో ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా.. లక్షలు ఖర్చుచేసినా నయం కాలేదు. సికింద్రాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చూపించుకోగా.. కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. తన భర్తను రక్షించుకునేందుకు లావణ్య.. తన కాలేయాన్ని దానం చేయాలని నిర్ణయించుకుంది. వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు చేసి.. నవంబర్ 16న ఆపరేషన్ చేసి.. ఆమె శరీరం నుంచి 65 శాతం కాలేయాన్ని తీసి శ్రీనుకి అమర్చారు. భర్తకోసం కాలేయాన్ని దానం చేసిన ఆమెను వైద్యులు అభినందించారు.