- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Defence Deal: భారత్‌తో కీలక డిఫెన్స్ డీల్‌కు ఆమోదం తెలిపిన అమెరికా
దిశ, నేషనల్ బ్యూరో: భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేస్తూ కీలక పరిణామం చోటుచేసుకుంది. తన అధ్యక్ష పదవీకాలం పూర్తయ్యేందుకు కొన్ని వారాల ముందు యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ భారత్‌కు కీలకమైన రక్షణ పరికరాల విక్రయానికి ఆమోదం తెలిపారు. 1.17 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 9.91 వేల కోట్ల) విలువైన ఎంహెచ్-60ఆర్ మల్టీ-మిషన్ హెలికాప్టర్ల కోసం విడిభాగాల విక్రయాలకు ఆమోదం తెలిపినట్టు అమెరికా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎంహెచ్-60 ఆర్ మల్టీ-మిషన్ హెలికాప్టర్లు ప్రస్తుత, భవిష్యత్తులో శత్రు జలాంతర్గాములతో పాటు రాడార్లను ఎదుర్కొనేందుకు భారత జలాంతర్గామి యుద్ధ సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది. ఈ హెలికాప్టర్లలో వాడే మెషీన్‌గన్‌లు, లేజర్ గైడెడ్ రాకెట్‌లు, ఎంకే54 టోర్పిడోలు శత్రువులను ద్వంసం చేస్తాయి. వీటిలో ఉండే ఫార్వర్డ్-లుకింగ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ల ద్వారా రాడార్లకు, జలాంతర్గాములకు చెందిన ఖచ్చితమైన డేటాను అందిస్తాయి. ఒక ప్రాంతాన్ని స్కాన్ చేసి క్షిపణి దాడులకు సంబంధించి హెచ్చరికలను జారీ చేస్తాయి. సముద్రతీర రక్షణకు కీలకమైన ఆయుధంగా ఉండే ఈ హెలికాప్టర్ల ఒప్పందంతో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.