తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్.. ఈ సారి ఇద్దరు మంత్రులున్న జిల్లాలోనే ఘటన

by Mahesh |   ( Updated:2024-12-03 17:11:55.0  )
తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్.. ఈ సారి ఇద్దరు మంత్రులున్న జిల్లాలోనే ఘటన
X

దిశ, పెద్ద అడిశర్లపల్లి: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. తాజాగా మంగళవారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల మోడల్ స్కూల్ మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మౌనిక, పూజిత, మల్లీశ్వరి, ముగ్గురు విద్యార్ధినులు అస్వస్థత గురయ్యారు. వారు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో గిలగిలా కొట్టుకున్నారు. ఇది గమనించిన టీచర్లు వారిని హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. కాగా ప్రస్తుతం ముగ్గురు విద్యార్దులకు వైద్యం అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Advertisement

Next Story

Most Viewed