Bhatti: గతంలో గడీల పాలన.. ఇప్పుడు ప్రజాపాలన.. డిప్యూటీ సీఎం భట్టి

by Ramesh Goud |
Bhatti: గతంలో గడీల పాలన.. ఇప్పుడు ప్రజాపాలన.. డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వానికి గడీల పాలన(Rule Of Gadis) అయితే.. మా ప్రభుత్వానికి ప్రజా పాలన(Rule Of People) అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రజాపాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రులతో ముఖాముఖి(Face To Face Program With Ministers) కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి హజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమ సమస్యలను తెలిపేందుకు పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడే పరిష్కరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. ఒక వైపు ప్రజాభవన్ లో ప్రజావాణి నిర్వహిస్తూ.. సమస్యలను పరిష్కరించడంతో పాటు గాంధీభవన్ కూడా పార్టీ కార్యకర్తలను, ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలకి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమణించాలని అన్నారు. గత ప్రభుత్వంలోని పాలకులు లోపల బందించుకొని గడీల పాలన చేస్తే.. మా ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన అన్నట్లు సీఎం సహా మంత్రులు ప్రజలతో మమేకమే ప్రజాపాలన చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వం ముఖ్యంగా విద్యా, వైద్యంపై దృష్టి పెట్టి యువతకు బంగారు భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. నేటి చిన్నారులే రేపటి భవిష్యత్ అనేది దృష్టిలో పెట్టుకొని వారి చదువు కోసం భారత దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వం చేయనంతగా.. సకల సౌకర్యాలతో ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే డైట్ చార్జీలు 40 శాతం మేర పెంచి పిల్లల ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తున్నామని భట్టి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story