- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Adani Group: అమెరికాలో లంచం ఆరోపణలపై అదానీ గ్రూపు ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America)లో లంచం ఆరోపణలపై అదానీ గ్రూపు(Adani Group) స్పందించింది. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్(US Department of Justice) తమ సంస్థపైన చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఈ అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నది. తమ సంస్థ పూర్తి పారదర్శకతతో నిబంధనలు పాటిస్తుందని వెల్లడించింది. వాటా దారులు, ఉద్యోగులు, భాగస్వాములు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపింది. తాము చట్టాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించింది. ఈ ఆరోపణలు తమ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. సోలార్ ప్రాజెక్టు(Solar project) విషయంలో లంచం, మోసం కేసులో అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ పాత్రపై అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అదానీ సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం లంచం ఇచ్చి లబ్ధి పొందే మోసానికి పాల్పడిన విషయంలో కేసు నమోదు ఫైల్ చేశారు. ఈ కేసులో అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సహా ఏడుగురు వ్యక్తులు నిందితులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచాలు చెల్లించేందుకు అంగీకరించారని అధికారులు తెలిపారు. తాజాగా ఈ ఆరోపణలపై అదానీ గ్రూపు స్పందించి కొట్టిపారేసింది.