- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లాభసాటి పంట ఆయిల్ ఫామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష
దిశ,పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో మరో 950 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ జనవరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్ లో ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జనవరి నాటికి పెద్దపల్లి జిల్లాలో కొత్తగా 950 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు మొక్కల ప్లాంటేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ సాధన దిశగా వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చిన రైతుల నుంచి మొక్కలకు, డ్రిప్ కోసం వెంటనే డీడీలు సేకరించాలని కలెక్టర్ తెలిపారు. డీడీలు సమర్పించిన రైతులకు మొక్కల సరఫరా, డ్రిప్ సౌకర్యం ఏర్పాటు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీహెచ్ఎస్ఓ జగన్మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.