Polling is over: ముగిసిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు.. ఫలితాల విడుదలపై సిటీ సివిల్ కోర్టు స్టే

by Shiva |   ( Updated:2024-11-21 12:15:51.0  )
Polling is over: ముగిసిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు.. ఫలితాల విడుదలపై సిటీ సివిల్ కోర్టు స్టే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (Telangana Olympic Association) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎల్బీ స్టేడియం (LB Stadium)లోని ఒలింపిక్ భవన్‌ (Olympic Bhavan)లో టీవోఏ (TOA) అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి (Jithender Reddy), రాష్ట్ర బ్యాట్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్ నాథ్ (Jithender Reddy) బరిలో ఉన్నారు.

సెక్రటరీ (Secretary), ట్రెజరర్స్ (Treasurers) పదవుల కోసం ఎన్నిక జరుగుతుండగా.. మిగతా స్థానాలకు సభ్యుల ఎంపిక దాదాపుగా ఖరారైంది. జనరల్ సెక్రటరీ (General Secretary) పదవి కోసం బాబురావు, మల్లారెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉండగా.. ట్రెజరర్ పదవికి సతీష్‌గౌడ్, ప్రదీప్ కుమార్ బరిలో ఉన్నారు. టీవోఏ (TOA)లో మొత్తం 68 మంది సభ్యులు ఉండగా.. పొలింగ్ ముగిసే సమయానికి 59 ఓట్లు పోలయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (Telangana Olympic Association) ఎన్నికలను సవాలు చేస్తూ.. బాక్సింగ్ సంఘం సిటీ సవిల్ కోర్టు (City Civil Court)ను ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు విచారణ పూర్తయ్యేంత వరకు ఫలితాల ప్రకటనపై స్టే విధించింది.

Advertisement

Next Story

Most Viewed