Breaking News : ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్ కీలక నిర్ణయం

by M.Rajitha |
Breaking News : ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ(RGV)పై ఒంగోలు పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టు(AP High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారణను కోర్ట్ ఈనెల 26కు వాయిదా వేసింది. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన అగ్ర నేతలపై ఆర్జీవీ అభ్యంతరకర పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ జనరల్ సెక్రేటరీ ముత్తనపల్లి రామలింగయ్య ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేసి, విచారణకు రావాలని ఆయనకు నోటీసులు అందించారు.

Advertisement

Next Story