- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యం
దిశ, ఉట్నూర్ : మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యం అని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. పలు అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ చేశారు. ఉట్నూర్ మండలంలోని వేణునగర్ కాలనీలో రూ.34 లక్షలతో, అదే విధంగా లక్కారం గ్రామంలో రూ.20 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. గ్రామాల రూపు రేఖలను మార్చడానికి ప్రభుత్వం ముందడుగు వేసిందని, సమస్యలు ఉన్న ప్రతి చోట అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.