- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారులు చిత్త శుద్ధితో కృషి చేయాలి
దిశ,మక్తల్,నారాయణపేట ప్రతినిధి: నిరుపేదల అభ్యున్నతికి అధికారులు చిత్త శుద్ధితో కృషి చేయాలని, 2028 సంవత్సరం నాటికి ఆర్థిక ప్రగతిలో భారత్ మూడో స్థానంలో ఉండే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి, బండి సంజయ్ కుమార్ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా పర్యటన లో భాగంగా నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో మంత్రి, బండి సంజయ్ కుమార్ కు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ శాలం, ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల పూల మొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, బండి సంజయ్ కుమార్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఎంపీ డీకే అరుణ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి ఆయన అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్ వాడీ పిల్లలను ఊరి పేరు, మండలం, జిల్లా పేరు అడిగి వారితో జవాబు రాబట్టారు. సెంటర్ లో ఎంత మంది పిల్లలు ఉన్నారని,అందులో శ్యాం మ్యాం పిల్లలు ఎంతమంది అని టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆట వస్తువులను చూసి, పిల్లలికి ఇచ్చే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని టీచర్ ను అడగడంతో ఫర్నీచర్ అవసరమని, నీటి సమస్య ఉందని టీచర్ తెలిపారు. అధికారులకు చెప్పి ఫర్నీచర్ ను సమకూర్చుతానని, నీటి సమస్యను పరిష్కారింప చేస్తామని ఆయన తెలిపారు. వంటగది శుభ్రంగా ఉందని మెచ్చుకున్నారు. గర్భిణీలకు అందించే ఆహారం ఎలా ఉంటుందని ఆరా తీశారు. అక్కడే ఉన్న ఐదుగురు గర్భిణీలకు శ్రీమంతంలో భాగంగా పండ్లు, పసుపు, కుంకుమ, గాజుల కిట్టును అందజేశారు. ఇద్దరు చిన్నారులకు అన్న ప్రాసన చేశారు. కిచెన్ గార్డెన్ లో ఏ ఏ కూరగాయలు పండిస్తారని అడిగి తెెలుసుకున్నారు.
అనంతరం గ్రామంలోని పల్లె దవాఖానాను సందర్శించి రోగులకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తారని, రోజుకు ఎంతమంది రోగులు వస్తారని అడిగి తెలుసుకున్నారు. మందులన్ని అందుబాటులో ఉన్నాయా? అన్ని రికార్డులు సక్రమంగా రాస్తున్నారా లేదా ? ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ రోగులను 108 వాహనంలో మక్తల్, జిల్లా ఆసుపత్రికి తరలిస్తామని, రోజుకు 20 మంది దాకా రోగులు వస్తారని, అవసరమైన మందులు అన్ని ఉన్నాయని వైద్యుడు మంత్రికి తెలిపారు. అనంతరం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి జిల్లాకు నవోదయ పాఠశాలను మంజూరు చేయాలని మంత్రి బండి సంజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. అక్కడే ఉన్న ఓ దివ్యాంగుడు కూడా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. చివరగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్నీ పరిశీలించారు. పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారని? రోజూ మధ్యాహ్న భోజనo ఇలాగే పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో వంటగదిని నిర్మింప చేసి,గ్యాస్ స్టవ్ ను ప్రొవైడ్ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలోనే మీడియాతో మాట్లాడారు. వెనక బడిన ప్రాంతాలను కేంద్రం గుర్తించి వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని దేశవ్యాప్తంగా 112 జిల్లాలలో 500 బ్లాక్ ల మండలాలలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజల బాగోగులు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఎంపిక చేసిన జిల్లాలలోని గ్రామాల్లో కేంద్ర మంత్రులు పర్యటించి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయా లేదని పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. అభివృద్ధి చెందిన మండలాలకు దీటుగా ఆయా గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి, ములుగు నారాయణపేట జిల్లాలలో 10 ఆస్పిరేషన్ బ్లాక్ లు ఉన్నాయన్నారు. గురువారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా, శుక్రవారం రాయచూర్, గద్వాల జోగులాంబ జిల్లాలో పర్యటిస్తున్నట్లు మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. నీతి అయోగ్ ద్వారా సంపూర్ణత అభియాన్ నడుస్తుందని తెలిపారు. రాయికోడ్ గ్రామంలో అంగన్వాడి పిల్లలు, గర్భిణీలు, పాఠశాల విద్యార్థులతో మాట్లాడడం జరిగిందని ఏమైనా సమస్యలు ఉన్నాయా ? లేదా అని తెలుసుకోవడం జరిగిందన్నారు. 2028 సంవత్సరం నాటికి ఆర్థిక ప్రగతిలో భారత్ మూడవ స్థానంలో ఉండే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.