- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజన్న సాక్షిగా రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి : చొప్పదండి మాజీ ఎమ్మెల్యే
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : వేములవాడ రాజన్న పై ఒట్టు వేసి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రైతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశాడని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవి శంకర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం వేములవాడ పర్యటనలో భాగంగా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన నిప్పులు జరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలను రాజకీయ సభలుగా మార్చి, కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని తిట్లు, ఒట్లు తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. వారిని తలవకుండా ఏ సభ జరగడం లేదని, రామ జపం చేసినట్లు కేటీఆర్ జపం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనం బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనని, రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని కొనిపోయాడారు. 22 గుంటలు ఉన్న రాజన్న ఆలయం స్థలాన్ని 30 ఎకరాలకు పైగా సమకూర్చి, ఆలయ సుందరీకరణ పనులు చేసింది కేసీఆరేనని, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ చేసింది కూడా బిఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ అంటేనే అరాచక పాలనని, రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని విమర్శలు చేస్తున్నారని, ఆ ప్రాజెక్టు వల్లే భూమికి బరువన్నంత పంట పండుతుందని, దేశానికి అన్నపూర్ణలా తెలంగాణ మారిందని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగ పత్రాలు ఇస్తూ, 50 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రకటించుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేసి, ఎల్బీ స్టేడియంలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలకు సున్నాలు వేసి ప్రారంభిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిరిశాలగా ఉన్న సిరిసిల్ల మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉరిశాలగా మార్చిందని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ పాలన వచ్చిందని, అసమర్ధ ప్రభుత్వం పాలనలో గురుకుల విద్యార్థులు పురుగుల అన్నం తిని ఆసుపత్రుల పాలవుతున్నారన్నారు. రాష్ట్రంలో రైతులు ఆగమై ధాన్యం దళారులకు అమ్ముకుంటున్నారని, బోనస్ మాట బోగస్ అయ్యిందని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ జిల్లాను కోనసీమగా మార్చింది కేసీఆరేనని, రైతులను వంచించి సీఎం కుటుంబ స్వలాభం కోసం రేవంత్ పరిశ్రమలు చేస్తున్నాడన్నారు. ముఖ్యమంత్రి గలీజ్ మాటలు బందు చేసి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.
మూసీ ప్రక్షాళన స్వాగతిస్తున్నామని, హైడ్రా పేరుతో పేదల పొట్ట కొట్టదన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీలతో పాటు మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మాజీ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య, నాయకులు గూడూరి ప్రవీణ్, గుండ్లపల్లి పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.