- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవ తప్పిదాలతోనే అటవీ అగ్ని ప్రమాదాలు.. ఆర్ఎం డోబ్రియల్
దిశ, తెలంగాణ బ్యూరో: అటవీ ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లనే ఎక్కువ జరుగుతున్నాయని తెలంగాణ అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి ఆర్ఎం.డోబ్రియాల్ అన్నారు. అటవీ అగ్ని ప్రమాదాలు - నివారణ చర్యలు, పరికరాలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనే అంశాలపై వివిధ రాష్ట్రాల అటవీ అధికారులతో రెండు రోజుల పాటు జరిగే వర్క్‌షాప్‌ను గురువారం హైద్రాబాద్‌లో ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ ఐజీ రాజేష్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కువ ఏయే రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గతేడాది ఉత్తరాఖండ్‌లో ఎక్కువ ప్రమాదాలు జరిగినట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ నరేంద్రసింగ్ బుందేల్ మాట్లాడుతూ.. ఎన్డీఆర్ఎఫ్ దళాలు అగ్ని ప్రమాద నివారణ చర్యల్లో భాగం అయ్యేందుకు అటవీ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
వీటి కోసం ప్రత్యేకంగా మూడు దళాలను ఏర్పాటు చేశామని తెలిపారు. దక్షిణ భారతానికి విజయవాడ కేంద్రంగా ఒక దళం పని చేస్తున్నారు. ఐఐఎఫ్ఎం డైరెక్టర్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ వర్క్‌షాప్‌లను నిర్వహించి అటవీశాఖ అధికారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అటవీ శాఖ అధికారి మాధవరావు రాసిన ‘ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ ఇన్ తెలంగాణ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ అడ్మిన్ సునీత్ భగవత్, అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.