- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sehwag's son : వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు డబుల్ సెంచరీ
దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) తనయుడు జూనియర్ సెహ్వాగ్ తండ్రి బాటలనే క్రికెట్ లో రాణిస్తూ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. షిల్లాంగ్ లో జరుగుతున్న జాతీయ స్థాయిలో అండర్ 19 క్రికెటర్లు ఆడే నాలుగు రోజుల క్రికెట్ టోర్నమెంట్ కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరుపున ఆడుతున్న ఆర్యవీర్ సెహ్వాగ్(Aryavir Sehwag)మేఘాలయ జట్టుపై అద్భుతమైన డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 229బంతుల్లోనే 34ఫోర్లు, 2సిక్సర్లతో ఆర్యవీర్ సరిగ్గా 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఆర్నవ్ తో కలిసి అతడు తొలి వికెట్ కు 180 పరుగులు జోడించాడు. ఆర్నవ్ సెంచరీ చేసి ఔటవ్వగా.. ఆర్యవీర్ డబుల్ సెంచరీ బాదాడు. ఆర్యవీర్ ద్విశతకం సహాయంతో ఢిల్లీ రెండోరోజు ఆట ముగిసే సమయానికి 468/2 స్కోర్ చేసింది. ధన్య నక్రా 98 రన్స్ తో క్రీజులో ఉన్నాడు. అంతకుముందు మేఘాలయ తొలి ఇన్నింగ్స్ లో 260 పరుగలకు అలౌట్ అయ్యింది.
కూచ్ బేహార్ టోర్నీ అంటే ప్రతి ఏటా జరుగుతుంది. గతేడాది తన కొడుకు ఆర్యవీర్ గురించి సెహ్వాగ్ మాట్లాడిన సందర్భంలో అప్పటికే ఐపీఎల్లోకి అడుగుపెట్టే దిశగా ఆర్యవీర్ అడుగులు వేస్తున్నట్లు తెలిపాడు. ఆర్యవీర్ అక్టోబర్ లో జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో మణిపూర్ తో ఆరంగేట్రం మ్యాచ్ లోనే 49 రన్స్ చేశాడు. గతంలో రంజీ ట్రోఫీలో రాణించినా ఇండియన్ టీమ్ లో చోటు దక్కని వాళ్లు ఉన్నారని, కానీ ఐపీఎల్లో బాగా ఆడితే మాత్రం నేషనల్ జట్టులో చోటు దక్కుతోందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.