- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను గెలిపించి ఉంటే మంత్రిని చేసేవాళ్లం
దిశ, వెబ్‌డెస్క్: యాదవ సామాజికవర్గ నేతల(Yadava community leaders)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్(CM Revanth) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నగర అభివృద్ధి(Hyderabad city Development)లో యాదవ సోదరుల పాత్ర కీలకమైనదని చెప్పారు. నగరంలో సదర్ ఉత్సవాలు(Sadar Festival) నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తాను ఆనాడే చెప్పా.. ఇక నుంచి ప్రతీ ఏటా సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. సదర్ అంటే యాదవుల ఖదర్ అని అన్నారు.
సదర్ సమ్మేళనాన్ని ప్రతీ గ్రామానికి తీసుకెళ్లాలని తెలిపారు. యాదవులు రాకీయంగా ఎదగాలని యువ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav)ను రాజ్యసభ(Rajya Sabha)కు పంపించామని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు పశు సంపదను పెంచి పోషించారు. ఆనాడు మూసీ పరివాహక ప్రాంతాల్లో యాదవ సోదరులు పశుగ్రాసాన్ని పెంచుకునేవారని గుర్తుచేశారు.
ప్రస్తుతం మురికి కూపంగా మారిన మూసీ(Musi)కి పునరుజ్జీవం కల్పిస్తామని అన్నారు. హైదరాబాద్(Hyderabad) అభివృద్ధికి యాదవ సోదరులు అండగా నిలబడాలని పిలపునిచ్చారు. ఏ శక్తులు అడ్డొచ్చినా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్‌ది అని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతవాసుల జీవన ప్రమాణాలను మెరుగు పరచబోతున్నామని అన్నారు.
యాదవ సోదరులు అవాకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆనాడు ముషీరాబాద్‌లో అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav)ను గెలిపించి ఉంటే.. మీవైపు నుంచి మంత్రిగా నిలబడేవారని కీలక వ్యాఖ్యలు చేశారు. అంజన్ కుమార్ ఓడినా యాదవ సోదరులకు ప్రాధాన్యత ఉండాలనే అనిల్‌కు రాజ్యసభ ఇచ్చామని తెలిపారు. ‘శ్రీకృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడ్డాడు.. అందుకే కురుక్షేత్రంలో అధర్మం ఓడి ధర్మం గెలిచింది. యాదవ సోదరులు కూడా ధర్మం వైపు నిలబడాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు.