CM Chandrababu: పార్టీకి మేము వారసులమే.. కానీ పెత్తందార్లం కాదు: సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2025-03-29 06:25:00.0  )
CM Chandrababu: పార్టీకి మేము వారసులమే.. కానీ పెత్తందార్లం కాదు: సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌వెస్క్: పార్టీకి తాము వారసులమే.. కానీ పెత్తందార్లం కాదని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంగళగిరి (Mangalagiri) జరగుతోన్న పార్టీ 43వ ఆవిర్భావ వేడుకులకు ఆయన హాజరయ్యారు. ముందుగా తెలుగుదేశం (Telugudesham) పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం మహనీయుడు ఎన్టీఆర్ (NTR) పెట్టిన పార్టీనే టీడీపీ అని కొనియాడారు. పార్టీ అవిర్భావానికి చారిత్రక అవసర ఏర్పడిందని అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి కావడం ఆషామామీ విషయం కాదని.. ఆ ఘనత ఒక్క టీడీపీ (TDP)కే దక్కిందని అన్నారు. యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తనకు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావని.. క్షేత్ర స్థాయిలో పనిచేసిన వాళ్లకు ఆటోమెటిక్‌గా పదువులు ఇస్తామని కామెంట్ చేశారు. ఎవరు సిఫార్సు చేసినా తాను పదవులు ఇవ్వబోనని.. పనితీరు ఆధారంగానే పార్టీలో ఎవరికైనా సముచిత గౌరవం దక్కుతుందని కామెంట్ చేశారు.

తెలుగు జాతి ఉన్నంత కాలం టీడీపీ (TDP) ఉంటుందని.. పార్టీకి తాము వారసులమే కానీ పెత్తందారులం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీని నాశనం చేసేందుకు ప్రయత్నించిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని కామెంట్ చేశారు. ఆడపడుచులకు, అన్నదాతలకు, సామాన్యులకు అండగా నిలిచిన జెండా పసుపు జెండానే అని అన్నారు. అన్నదాతకు అండగా నాగలి, కార్మికులకు, పారిశ్రామిక ప్రగతికి చిహ్నం చక్రం అని తెలిపారు. నిరుపేదలకు అందించే ఇల్లు తమ జెండాలో ఉన్నాయని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో గుప్తుల కాలం గురించి చెప్పుకున్నట్లే టీడీపీ గురించి చెప్పుకుంటుంటారని అన్నారు.

విద్య, విద్యుత్ సంస్కరణలు తెచ్చింది టీడీపీనే అని.. సంపద వచ్చిందంటే ముందుచూపుతో పనిచేసే పార్టీ తమదేనని అన్నారు. 43 ఏళ్లలో ఎన్నో సంక్షోభాలు వచ్చాయని.. అకాశంగా తీసుకుని విజయాలు సాధిస్తున్నామని తెలిపారు. ప్రతి కార్యకర్త చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటామని.. మరో చరిత్రకు శ్రీకారం చుట్టుబోతున్నామని అన్నారు. పేదరికం లేని సమాజం కోసం పీ4, మార్గదర్శి-బంగారం కుటుంబం పథకాలను తీసుకొస్తున్నామని తెలిపారు. సంపద సృష్టించి ఆ సంపద పేదలకు చేర్చాలనే తన సంకల్పమని అన్నారు. ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు ఎదురైనా కార్యర్తలు మాత్రం ధైర్యాన్ని వీడలేదని తెలిపారు. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.

Next Story

Most Viewed