Investment Strategy: మీ దగ్గర రూ. 10 లక్షలు ఉన్నాయా? ఇలా ఇన్వెస్ట్ చేస్తే మీరే బాసు తమ్ముడు!

by Vennela |
Investment Strategy: మీ దగ్గర రూ. 10 లక్షలు ఉన్నాయా? ఇలా ఇన్వెస్ట్ చేస్తే మీరే బాసు తమ్ముడు!
X

దిశ, వెబ్ డెస్క్: Investment Strategy: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం సూచీలు కోలుకుంటాయనే ఆశలు చిగురించినప్పటికీ ట్రంప్ టారిఫ్ ప్రకటన వీటిపై నీళ్లుజల్లింది. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రూ. 10లక్షలు ఉన్న ఒక ఇన్వెస్టర్ ఎలాంటి స్రాటజీతో ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 3న ప్రతీకార సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని అన్నిదేశాలపై వీటిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ నిర్ణయంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది నెలలుగా నష్టాల్లోనే కొనసాగుతున్న సూచీలు ఇటీవలి కాలంలో కాస్త కోలుకున్నట్లు కనిపించాయి. కానీ ట్రంప్ టారిఫ్స్ పుణ్యమా అని సూచీలు మళ్లీ కుప్పకూలాయి. భరత్ తోపాటు ప్రపంచ మార్కెట్లన్నీ భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

పెట్టుబడిదారులు అధిక రిటర్న్స్ పొందేది స్టాక్ మార్కెట్లోనే. అయితే గత కొద్దినెలలుగా అనిశ్చితిలో కొనసాగుతూ నష్టాలను చూస్తున్నాయి. బంగారం మాత్రమే మంచి రిటర్న్స్ అందించింది. సరికొత్త జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరుకుని రికార్డు క్రియేట్ చేసింది. దీంతో బంగారంలో పెట్టుబడి పెట్టినవారికి ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఫిక్స్డ్ ఇన్ కమ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసినవారు కూడా సేఫ్ గా ఉన్నారు. ఎందుకంటే వీటిలో స్థిరమైన ఆదాయం ఉంటుంది. రిస్క్ ఉండదు. ట్రంప్ టారిఫ్స్ ప్రకటన మార్కెట్ రికవరీ ఆశలపై నీళ్లుచల్లినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే మార్కెట్లు పడిపోయిన ప్రతిసారి కచ్చితంగా రికవరీ సాధిస్తాయని స్పష్టం చేశారు. అయితే దీనికి ఎంత సమయం పడుతుందనేది చెప్పలేమంటున్నారు.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు నిపుణులు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని కన్జర్వేటివ్ ఇన్వేస్టర్లు 25-30శాతం నిధులను మల్టీ అసెట్ ఫండ్స్ లో 20-40శాతం నిధఉలను కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ లో 20-40శాతం డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే మంచిందని సూచించారు. ఈ పోర్ట్ ఫోలియో అయితే అనిశ్చితి తక్కువగా ఉంటుందని అంటున్నారు.

రిస్క్ తీసుకోవాలనుకునే అగ్రెసివ్ ఇన్వెస్టర్లు 75-80 శాతం నిధులను ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేయవచ్చని గోల్ టెల్లర్ వ్యవస్థాపకుడు వివేక్ బంకా సూచించారు. పోర్ట్ పోలియోను చెక్ చేసుకుని తమ లక్ష్యాలకు అనుగుణంగా అసెట్స్ ను కేటాయించుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ నుంచి పూర్తిగా వైదొలగడం లేదా ఇన్వెస్ట్ మెంట్లను ఆపడం సరైన నిర్ణయం కాదని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే సంపద స్రుష్టించుకునే అవకాశాన్ని కోల్పోవడమే అవుతుందని చెబుతున్నారు. మార్కెట్ పడిపోయినప్పుడు ఇన్వెస్టర్లకు మంచి అవకాశం లభిస్తుందని దీనిని సద్వినియోగం చేసుకుంటే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చని చెబుతున్నారు. అయితే సరైన స్టాక్స్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.


Next Story

Most Viewed