- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నాయకులు,అధికారుల అండదండలతో ఒకరి లోన్ మరొకరికి..

దిశ, కొమురవెల్లి : ఒకరికి మంజూరైనా మైనారిటీ కార్పొరేషన్ లోన్ బీఆర్ఎస్ నేతలు,అధికారుల అండదండలతో అదే పేరుగల మరొకరికి ఇప్పించారని,ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ కిరణాలు ప్రవేశపెట్టిన లోన్ అప్లై చేయడానికి ఇంటర్నెట్ సెంటర్ కు వెళ్లిన వ్యక్తి లోన్ రాదని తెలుసుకొని కంగుతిన్నాడు. ఇక లోన్ రాదని బోరుమన్నాడు.వివరాల్లోకి వెళితే కొమురవెల్లి మండలం రాసులాబాద్ గ్రామానికి చెందిన బహదూర్ తండ్రి హైదర్ మియా వృత్తి రీత్యా కూలీ, కూలీ నాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో 2023-2024 ఆర్థిక సంవత్సరంలో చికెన్ షాప్ నడుపుకొనుటకు మైనారిటీ కార్పొరేషన్ లోన్ అప్లై చేసుకున్నాడు లోన్ మంజూరైంది. అంతలోనే ఆనాటి బీఆర్ఎస్ నాయకులు అధికారుల అండదండలతో అదే గ్రామంలో వున్న అదే పేరు గల మరో వ్యక్తికి సదరు లోన్ ఇప్పించారు. కాగా కొత్త లోన్ కోసం ఇంటర్నెట్ సెంటర్ వెళ్లిన వ్యక్తి కి లోన్ రాదని, ఇదివరకే లోన్ మంజూరైనట్లు తెలిపారు.కంగుతిన్న బాధితుడు లబోదిబోమని న్యాయం చెయ్యండి అంటూ వేడుకుంటున్నాడు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితుడికి రాజీవ్ యువ కిరణాలు లోన్ లో అవకాశం కల్పించి బాధితుడిని ఆదుకోవాలని విషయం తెలుసుకున్న పలువురు కోరుతున్నారు.చూడాలి మరి బాధితుడిని ఆదుకుంటారా ఏడిపిస్తారో..