- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే.. తొలిరోజే 40 శాతం రికవరీ చేసేసిందిగా..

దిశ, వెబ్‌డెస్క్: నార్నె నితిన్(Narne Nithin), రామ్ నితిన్(Ram Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan), విష్ణు(Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’(Mad Square). ఇది సూపర్ హిట్ విజయం సాధించిన ‘మ్యాడ్’(Mad) సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మాణంలో కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నిన్న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయి పాజివిట్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే.. మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ డే భారీగా వసూళ్లు రాబట్టినట్లు టీటౌన్ వర్గాలు తెలిపాయి. మొదటి రోజు ఏకంగా రూ17కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. బ్రేక్ ఈవెన్ విలువ రూ45కోట్లు కాగా తొలిరోజే ఏకంగా 40 శాతం రికవరీ చేసినట్లు పేర్కొన్నాయి. కాగా లాంగ్ వీకెండ్ కావడంతో భారీ వసూళ్లు వచ్చే చాన్స్ అయితే ఉందని చెప్పాలి. మరి చూద్దాం ఈ సినిమా ఎంత కలెక్షన్లను రాబడుతుందో.
Read More..