- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎక్స్ ఖాతాలో తప్పుడు ప్రచారం.. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు
by Aamani |

X
దిశ నల్లబెల్లి: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నల్లబెల్లి ఎస్సై గోవర్ధన్ తెలిపారు.ఓ గుర్తు తెలియని వ్యక్తి @commonman R86322 అనే ట్విట్టర్ (X) అకౌంట్ ద్వారా నల్లబెల్లి పోలీసులు అందరూ దొంగలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఆధారాలు లేకుండా పోలీస్ పేరును సమాజంలో కించపరుస్తున్న ఆ వ్యక్తి పై కేసు నమోదు చేయడం జరిగిందని ఆ వ్యక్తిని దర్యాప్తు అనంతరం అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు.చట్టాన్ని ఉల్లంఘించి,ఉద్దేశ్యపూర్వకంగా ప్రజలను, రాజకీయ పార్టీ , వ్యక్తులను అధికారులను కించపరిచేటట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేసినట్లయితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story