రెండు రోజుల్లోనే సునామీ సృష్టించిన ‘L2: ఎంపురాన్’.. ఒక్క ట్వీట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన మోహన్‌లాల్

by Hamsa |   ( Updated:2025-03-29 06:24:29.0  )
రెండు రోజుల్లోనే సునామీ సృష్టించిన ‘L2: ఎంపురాన్’.. ఒక్క ట్వీట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన మోహన్‌లాల్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) నటించిన లేటెస్ట్ మూవీ ‘L2: ఎంపురాన్’(L2: Empuran). అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కీలక పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇందులో టోవినో థామస్‌(Tovino Thomas), కన్నడ కిషోర్‌, మంజు వారియర్‌(Manju Warrier) , కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా 2019లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చింది. ‘ ‘L2: ఎంపురాన్’’ను లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా మార్చి 27న థియేటర్స్‌లోకి వచ్చింది.

ఈ మూవీ మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే భారీ కలెక్షన్స్ కూడా రాబడుతోంది. తాజాగా, మోహన్‌లాల్ ‘ ‘L2: ఎంపురాన్’’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 48 గంటల్లో రూ. 100 కోట్లు రాబట్టింది. సినిమా చరిత్రలోనే కొత్త రికార్డ్‌ను నెలకొల్పిందని మోహన్‌లాల్ వెల్లడించారు. ‘‘ ‘L2: ఎంపురాన్’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 48 గంటలలోపే 100 కోట్లను అధిగమించి, సినిమా చరిత్రలో కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పింది.

ఈ అసాధారణ విజయంలో భాగమైనందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు! మీ ప్రేమ మరియు మద్దతు ఇది సాధ్యమైంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో మోహన్‌లాల్ మాస్ లుక్‌లో కనిపించారు. మంటల్లో విలన్స్‌ను చితకొడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే మలయాళ ఇండస్ట్రీలో వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలు కేవలం 10 మాత్రమే ఉన్నాయని సమాచానం. ఇక ఇందులో ఇప్పుడు ఎంపురాన్-2 కూడా చేరడం విశేషం. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ 500 కోట్ల వరకు రాబట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు.

Read More..

మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే.. తొలిరోజే 40 శాతం రికవరీ చేసేసిందిగా..

Next Story