మార్కెట్లకు మళ్లీ లాభాలు..

by Harish |
మార్కెట్లకు మళ్లీ లాభాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా ఐదోరోజు ర్యాలీ చేశాయి. ప్రధానంగా రిలయన్స్, బ్యనకింగ్ షేర్ల మద్దతుతో శుక్రవారం మార్కెట్లు లాభాలను దక్కించుకున్నాయన్ని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అంశంలో జో బైడెన్ విజయానికి దగ్గరగా ఉండటంతో అమెరికా మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. అమెరికా ఎన్నికల ప్రభావంతో అంతర్జాతీయంగా మార్కెట్లు రాణిస్తున్నాయి.

వారాంతం దక్కించుకున్న లాభాలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుత ఏడాది జనవరి నాటి స్థాయిలో ట్రేడయ్యాయి. వారాంతం ర్యాలీ తర్వాత మార్కెట్లు చారిత్రాత్మక గరిష్టాలకు చేరువలో ఉండటం గమనార్హం. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 552.90 పాయింట్లు ఎగసి 41,893 వద్ద ముగియగా, నిఫ్టీ 143.25 పాయింట్లు పుంజుకుని 12,263 వద్ద ముగిసింది. నిఫ్టీలో అత్యధికంగా బ్యాంకింగ్ రంగ షేర్లు 2 శాతానికి పైగా ర్యాలీ చేయగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్, రియల్టీ, ఐటీ రంగాలు పుంజుకున్నాయి.

ఫార్మా మాత్రం స్వల్పంగా డీలాపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించగా, మారుతీ సుజుకి, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్, ఆల్ట్రా సిమెంట్, నెస్లె ఇండియా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.17 వద్ద ఉంది.

Advertisement

Next Story