సచివాలయ ఉద్యోగులకు కరోనా.. సీఎస్‌కు లేఖ

by Shyam |
సచివాలయ ఉద్యోగులకు కరోనా.. సీఎస్‌కు లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : సచివాలయంలో 61 మంది ఉద్యోగులకు ఇటీవల కరోనా పాజిటివ్ సోకింది. ఇరుకైన స్థలంలో ఎక్కువ మంది పనిచేస్తున్నందున ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తోంది. వివిధ శాఖల, విభాగాల హెడ్‌లంతా ఇండ్ల నుంచి పని చేస్తున్నా క్రింది స్థాయి సిబ్బంది మాత్రం ఆఫీసుకే వచ్చి పనిచేయాల్సి వస్తోంది. సాధారణ పరిపాలన శాఖలో పన్నెండు మంది, ఆర్థిక శాఖలో ఆరుగురు, వైద్యారోగ్య శాఖలో ఐదుగురు, పంచాయతీరాజ్‌లో నలుగురు, విజిలెన్స్ విభాగంలో ఐదుగురు.. లా మొత్తం ఈ వారం రోజుల్లోనే వైరస్ బారిన పడ్డారు. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాధవరం నరేందర్ రావు లిఖితపూర్వకంగా ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

లేఖలో ప్రధాన అంశాలు..

1. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ రోజు విడిచి రోజు హాజరయ్యేలా నిర్ణయం తీసుకోండి.
2. రోజూ 50% మంది ఉద్యోగులు మాత్రమే హాజరయ్యేలా ఆలోచించండి.
3. సచివాలయంలోని డిస్పెన్సరీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేలా ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టండి.
4. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఉద్యోగులకు పదిహేను రోజుల ప్రత్యేక క్యాజువల్ లీవ్‌ను మంజూరు చేయండి.
5. కరోనా కారణంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రస్తుతం లక్ష రూపాయల వరకు వైద్య ఖర్చుల్ని రీఇంబర్స్ చేసేలా తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించి ఆ పరిమితిని మూడు లక్షల రూపాయలకు పెంచండి.

Advertisement

Next Story

Most Viewed