హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు సెబీ భారీ జరిమానా!

by Harish |
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు సెబీ భారీ జరిమానా!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ భారీగా జరిమానా విధించింది. కస్టమర్ సెక్యూరిటీలను విక్రయించడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఈ భారీ జరిమానా విధించినట్టు తెలుస్తోంది. రెగ్యులేటర్ మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించిన కారణంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) రూ. కోటి జరిమానా విధించింది. 2019, అక్టోబర్ 14న చెల్లించాలని జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పాటించని కారణంగా ఆరోజు నుంచి ఇప్పటివరకు వడ్డీతో పాటు సమానమైన మొత్తాన్ని జమచేయాలని బ్యాంకును ఆదేశించింది. స్టాక్ బ్రోకింగ్ సంస్థ బీఆర్‌హెచ్ వెల్త్ క్రియేటర్స్ లిమిటెడ్ విషయంలో హెచ్‌డీఎఫ్‌సీ నిబంధనలను ఇల్లంఘించిందని సెబీ ఆరోపించింది. 2019, అక్టోబర్ 14 నుంచి ఇప్పటివరకు వడ్డీతో కలిపి రూ. 158.68 కోట్లను చెల్లించాలని సెబీ ఆదేశాలను జారీ చేసింది. కాగా, శుక్రవారం సెబీ ప్రకటనతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ ధర 2.24 శాతం నష్టపోయి రూ. 1,443 వద్ద నమోదైంది.

Advertisement

Next Story