పరదా ధరిస్తే ఏంటి బ్రదర్.. అంతా అల్లాహ్ చూసుకుంటాడు

by Shyam |
పరదా ధరిస్తే ఏంటి బ్రదర్.. అంతా అల్లాహ్ చూసుకుంటాడు
X

దిశ, సినిమా : హీరోయిన్ సనా ఖాన్ గతేడాది ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించింది. అల్లాహ్ నామస్మరణలో మిగిలిన జీవితం గడిపేయాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపింది. ఆ తర్వాత అనస్ సయ్యద్‌ను పెళ్లి చేసుకున్న భామ.. ఫ్యామిలీ లైఫ్‌కు అంకితమైపోయింది. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన సన తాజాగా ‘హిజాబ్‌’ ధరించిన ఫొటో పోస్ట్ చేయగా.. దీనిపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఇంత చదువుకున్న మీరు ఇలా పరదాల వెనుక దాక్కోవడం వల్ల ఆ విద్యకున్న ప్రయోజనమేంటి?’ అని ప్రశ్నించాడు. దీనిపై ఫైర్ అయిన సన .. ‘పరదా ధరిస్తే ఏంటి బ్రదర్? నేను విజయవంతంగా నా వ్యాపారం చేసుకుంటున్నాను. అద్భుతమైన భర్త, అత్తమామలతోపాటు రక్షణగా అల్లాహ్ ఉన్నాడు. ఇంతకు మించి ఏం కావాలి? నా చదువు కూడా పూర్తి చేశాను. ఇది విన్ విన్ సిట్యుయేషన్ కాదంటారా?’ అని ప్రశ్నించింది.

Advertisement

Next Story

Most Viewed