ములాయం ఆరోగ్యంగానే ఉన్నారు

by Shamantha N |   ( Updated:2020-08-12 05:16:15.0  )
ములాయం ఆరోగ్యంగానే ఉన్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: యూరిన్ ఇన్‌ఫెక్షన్‌‌తో యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ గతవారం లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని.. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు.

కాగా 80ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ మూత్రనాళంలో ఇన్ ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ప్రస్తుతం చికిత్స జరుగుతోందని.. ములాయం కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని మేదాంత ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కపూర్ పేర్కొన్నారు.

ఇదిలాఉండగా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్, ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్‌లు ఇటీవల ఆయన ఆరోగ్యం పరిస్థితులపై వైద్యులతో చర్చించారని పార్టీ ప్రతినిధి ఒకరు ప్రకటించారు.

Advertisement

Next Story