ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు జీతాలు పెంపు

by Shamantha N |
ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు జీతాలు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని పెద్ద కంపెనీలే ఉద్యోగులను తీసివేస్తూ, సగం వేతనాలే చెల్లిస్తున్న క్రమంలో ప్రైవేట్ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పాయి. ఇదేక్రమంలో యాక్సిస్ బ్యాంక్ వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. అక్టోబర్ నుంచి ఉద్యోగుల జీతాలను 4 నుంచి 12శాతం వరకు పెంచేందుకు ఓకే చెప్పింది. దీంతో 76,000 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. మరోవైపు దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏప్రిల్‌లోనే సామర్థ్యం ఆధారంగా తమ ఎంప్లాయిస్ శాలరీలను పెంచినట్లు బిజినెస్‌ స్టాండర్డ్ కథనం పేర్కొన్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story