ఎయిర్‌పోర్టు నుంచి వెనక్కి రప్పించిన ‘శాయ్’

by Shyam |
ఎయిర్‌పోర్టు నుంచి వెనక్కి రప్పించిన ‘శాయ్’
X

టోక్యో 2020 ఒలంపిక్స్ కోసం నెల రోజులుగా మహిళా హాకీ జట్టు బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) సౌత్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. వీరిలో కొందరు సెలవు మంజూరు చేయమని కోరడంతో.. అధికారులు వారం రోజుల అనుమతి ఇచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో బయట ఎలా ఉండాలనే విషయాలు వివరించడంతో పాటు శానిటైజర్లు కూడా ఇచ్చి పంపించారు.

అయితే, వీరంతా మరికాసేపట్లో బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో విమానం ఎక్కాల్సి ఉందనగా.. అందరి టికెట్లను క్యాన్సిల్స్ చేసి తిరిగి శాయ్ సెంటర్‌కు పిలిపించారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున బయటకు వెళ్తే వైరస్ సోకుతుందేమోననే అనుమానంతో వారిని వెనక్కు రప్పించినట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి శిక్షణా కార్యక్రమం కొనసాగుతోందని.. కొంత మంది వారం రోజుల సెలవు తీసుకుని ఎయిర్‌పోర్టుకు వెళ్లిన తర్వాత తిరిగి పిలిపించామని అధికారులు చెబుతున్నారు. వారికి మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణా కార్యక్రమం కొనసాగిస్తామని శాయ్ స్పష్టం చేసింది.

tags : Olympics, Women Hockey, Kempegowda Airport, Corona virus, SAI

Advertisement

Next Story

Most Viewed