- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘RRR’ ప్రమోషన్స్ కోసం జక్కన్న భారీ ప్లాన్..
దిశ,సినిమా : టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి భారీ హిట్లు అందించడమే కాదు.. ప్రమోషన్ స్ట్రాటజీలో మంచి ఎక్స్‌పర్ట్ అనే విషయం బాహుబలితో రుజువైంది. అయితే తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ ప్రమోషన్స్ కోసం రూ.20 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా దేశంలో ఉన్న పెద్ద నగరాల్లో ప్రమోషన్ మొదలుపెట్టాలని భావిస్తున్నారట. అందుకోసం భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు, పెద్ద సెట్లతోపాటు స్టార్స్ ప్రయాణాల కోసం ప్రత్యేకమైన చార్టెడ్ ఫ్లైట్స్ బుక్ చేయనున్నారని సమాచారం. అంతేకాదు సౌత్, నార్త్‌లో ఉన్న క్రేజీ టీవీ షోస్‌తో పాటు, సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్ మొదలు పెట్టే పనిలో ఉన్నారట మూవీ టీమ్. ఇక కరోనా కారణంగా ఆర్‌ఆర్‌ఆర్‌పై దాదాపు 150 కోట్ల బడ్జెట్ అదనంగా ఖర్చు అయిందని, దాన్ని పూడ్చడానికే మూవీ యూనిట్ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా బడ్జెట్ మొత్తం రూ.550 కోట్లు దాటిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ మూవీ 2022 సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
- Tags
- jr ntr