- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీకి రోజా స్ట్రాంగ్ వార్నింగ్
టీడీపీకి ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ గూండాలు రైతుల ముసుగులో దాడులు చేయాలని ప్రయత్నిస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రోజా హెచ్చరించారు. అమరావతి పేరిట ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పిన రోజా.. ఇప్పటికైన చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. లేని పక్షంలో టీడీపీ చేస్తున్న ప్రజా చైతన్య యాత్రలో తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. అమరావతిలో టీడీపీ నేతలు స్పందిస్తున్న విధానంలోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలు స్పందిస్తే టీడీపీ నేతల పరిస్థితేంటో ఊహించుకోవాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోజా ఆగ్రహానికి కారణమేంటంటే.. అమరావతికి దగ్గర్లోని ఐనవోలులోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ‘పరిశ్రమ-విద్య’ అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు రోజా యూనివర్సిటీకి వెళ్లారు. ఆమె యూనివర్సిటీలో ఉన్న విషయం తెలుసుకున్న అమరావతి ప్రాంత మహిళా రైతులు యూనివర్సిటీ గేటు వద్ద గుమికూడి రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రోజాకి చిర్రెత్తుకొచ్చింది. రైతుల ముసుగులో టీడీపీ గూండాలు దాడులకు యత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలను కూడా అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారని గుర్తు చేసిన రోజా.. రైతులు అలా వ్యవహరిస్తారా? అని అడిగారు.
సీఆర్డీఏ పేరిట టీడీపీ నేతలు పచ్చని పంటపొలాలను నాశనం చేశారని రోజా మండిపడ్డారు. 4 వేల ఎకరాలకుపైగా టీడీపీ నేతలు దోచుకున్నారని ఆమె విమర్శించారు. అమరావతి మాత్రమే పన్నులు కడుతోందా? మిగిలిన 13 జిల్లాల ప్రజలు పన్నులు కట్టడం లేదా? అని నిలదీశారు. ఆ 12 జిల్లాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా? అని ఆమె ప్రశ్నించారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఎవరిపైనో కక్షతోనో లేదా కుట్రతోనో కాదని, కేవలం ప్రజలపై ప్రేమతోనేనని ఆమె స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలపై దాడులు చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా ఇలాగే స్పందిస్తే.. టీడీపీ నేతలు ఒక్క అడుగు కూడా వెయ్యలేరని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు డ్రామాలు కట్టిపెట్టాలని ఆమె సూచించారు. హైదరాబాదులో తాను కట్టిన ఇంటికి ఎవరినీ ఎందుకు రానీయడం లేదని ఆమె ప్రశ్నించారు. ఎవరికెన్ని ఆస్తులున్నాయో ఎన్నికల అఫిడవిట్ చూస్తే తెలుస్తుందని ఆమె సూచించారు. రాజధాని పేరిట దోచుకోబట్టే మంగళగిరిలో లోకేశ్‌ను చిత్తుగా ఓడించారని ఆమె తెలిపారు.