పార్టీ మారిన నేతలు రద్దైన వెయ్యి రూపాయల నోట్ల లాంటి వాళ్లు : రేవంత్

by Shyam |   ( Updated:2021-07-04 02:44:16.0  )
revanth-reddy 1
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో పార్టీ మారిన నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఆదివారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. రైతులు, విద్యార్ధుల కోసం తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో పంట కొనుగోలు లేదు, గిట్టుబాటు ధర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఏ ఒక్కరూ మంత్రి వర్గంలో లేరని ఆరోపించారు. తెలంగాణ ద్రోహులే మంత్రులయ్యారని అన్నారు.

కాంగ్రెస్ ద్రోహులు, తెలంగాణ ద్రోహులను తరిమికొట్టే రోజులు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన వారు రాజీనామా చేసి మాట్లాడాలన్నారు. పార్టీ మారిన నేతలు(ఎమ్మెల్యేలు) రద్దైన వెయ్యి రూపాయల నోట్ల లాంటి వాళ్లని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీకు చీము, నెత్తురు ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీరు గ్రామాల్లోకి వస్తే మా కార్యకర్తలు మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారాని అన్నారు. ఇన్నాళ్లూ మా పార్టీ నేతలు మర్యాదగా ఉన్నారని.. పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఇక సహించేది లేదని ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed